Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన బాధ్యతలు చేపట్టిన రాజు పటేల్‌కు ఘన స్వాగతం కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 05:00 AM

ఉపాధి కూలీల సమస్యలపై సానిపల్లిలో వ్యవసాయ కార్మిక సంఘం ఆందోళన

ఉపాధి కూలీల సమస్యలపై సానిపల్లిలో వ్యవసాయ కార్మిక సంఘం ఆందోళన

ఉపాధి కూలీల సమస్యలపై సానిపల్లిలో వ్యవసాయ కార్మిక సంఘం ఆందోళన
June 02, 2026 01:09 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం సానిపల్లి గ్రామంలో ఈరోజు ఉపాధి కూలీల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పని ప్రదేశాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నారాయణ మాట్లాడుతూ, V.B.G.RAMG ఉపాధి పథకం వల్ల కూలీలకు నష్టం జరుగుతోందని ఆరోపించారు. పాత విధానంలోనే ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, ఇందుకు జరుగుతున్న నిరసన పోరాటాల్లో కూలీలు ఐక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.


పేస్ యాప్ విధానాన్ని రద్దు చేయాలని, నాలుగు వారాలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కూలీలతో కలిసి ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.


పని ప్రదేశాల్లో గడార్, పార, గంపలు, మజ్జిగ, మంచినీరు, మెడికల్ సదుపాయాలు కల్పించాలని, ఐదు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే కూలీలకు రోజుకు రూ.20 నుంచి రూ.40 వరకు ఆటో ఛార్జీలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగప్ప, పి.సరస్వతి, కుమ్మరి లక్ష్మీదేవి, కె.అంజనప్ప, కుమ్మరి గంగమ్మ, ఆదిలక్ష్మమ్మ, రంగమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News