Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:30 AM

ఉపాధి హామీ కార్మికులకు బీమా కల్పించాలి.. కూలీ ₹800కు పెంపు డిమాండ్

17-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బొమ్మలరామారం: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని మర్యాల గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.

ఎండాకాలంలో వడదెబ్బతో పాటు పని ప్రదేశాల్లో ప్రమాదాలకు గురై కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో మరణించిన కార్మికులకు కనీసం రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.

వ్యవసాయ రంగంలో మార్పుల వల్ల కూలీలకు సరిపడా పని దొరకడం లేదని, ఉపాధి హామీ పథకంలో సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని అన్నారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో రోజు కూలీని రూ.800కు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న ఆందోళనల్లో కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, కార్మికులు లత, నిర్మల, భాగ్య, ఉమారాణి, బాలమణి, అనురాధ, విజయ, కల్పన, సోగ్రాబి, బేగం, నర్సింహ, సునీత, పోచమ్మ, కవిత, ఇందిర, అమరావతి, యాదగిరి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి హామీ కార్మికులకు బీమా కల్పించాలి.. కూలీ ₹800కు పెంపు డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News