Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:46 AM

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌ వద్ద నిరసన

18-04-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాయకులు ఆరోపించారు.

ఈ సందర్భంగా డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, ఖాళీల భర్తీ, పెండింగ్‌ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వినోకుమార్‌, జిల్లా కార్యదర్శి మల్లయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, వాటిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేణుక, నాయకులు సతీష్‌, అమృత మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

నిరసన కార్యక్రమంలో టీజీఈజేఏసీ, డీటీఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌ వద్ద నిరసన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News