Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:17 PM

ఉపాధి హామీకి ఉరేసిన కేంద్ర సర్కార్...

ఉపాధి హామీకి ఉరేసిన కేంద్ర సర్కార్...

ఉపాధి హామీకి ఉరేసిన కేంద్ర సర్కార్...
29-12-2025 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామీణుల పొట్టకొట్టేందుకు బీజేపీ యత్నం..

మహత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారిస్తూ.గ్రామీణ పేదల ఉపాధికి కేంద్ర సర్కార్ ఉరి వేసే ప్రయత్నం చేస్తుందని కొత్తగూడెం భద్రాచలం జిల్లా కాంగ్రెస్ పార్టీ అజ్వర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ ఆరోపించారు.ఆదివారం కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సంధర్బంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలకు నిరసనగా టీపీసీసీ పిలుపు మేరకు భువనగిరి మున్సిపల్ పరిధిలోని జెండా ఎగురవేసి నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ...దేశంలో పేద ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ప్రధాని డా.మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని మహాత్మా గాంధీ పేరుతో ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం నిధులు సమకూర్చడం ద్వారా లక్షలాది పేద కుటుంబాలకు ఉపాధి లభించిందని, ఎంతోమంది ఆకలి చావుల నుంచి రక్షించబడడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు సైతం అభివృద్ధి చెందాయన్నారు. అయితే పేద ప్రజల ఉపాధిని ఓర్వలేని బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని బలహీనపరిచి, కొత్త పేరుతో ప్రవేశపెట్టడం ద్వారా పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి 90 శాతం నిధులు ఇస్తుండగా,కొత్త చట్టంతో 60 శాతం నిధులు మాత్రమే కేంద్రం ఇస్తుందని 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని అనడం ఉపాధి హామీ పథకానికి సమాధి కట్టడమేనన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వైఖరితో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని ఇప్పుడు ఈ భారం కూడా తోడవడంతో చాలా రాష్ట్రాలు ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్ముడు పేరుతో కాంగ్రెస్ పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ప్రయత్నం చేస్తే ఓర్వలేని బీజేపీ పేద ప్రజలను మళ్లీ ఆకలి చావులకు బలిచేసే విధంగా ప్రవర్తిస్తుందని విమర్శించారు.అదే విధంగా మహాత్ముడి పేరుతో సాగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వ అన్యాయాన్ని ప్రజ క్షేత్రంలో ఎండగడతామన్నారు.నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీర్మానించినట్టు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించని పక్షంలో జనవరి 5వ తేదీ నుండి కాంగ్రెస్ పార్టీ పక్షాన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి హామీకి ఉరేసిన కేంద్ర సర్కార్...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News