Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:25 AM

మిషన్ భగీరథ కార్మికుల ఆందోళన

మిషన్ భగీరథ కార్మికుల ఆందోళన

మిషన్ భగీరథ కార్మికుల ఆందోళన
27-05-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు మంగళవారం జిల్లా కేంద్రంలోని పానగల్‌లో ఉన్న మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం ముందు బీఆర్టీయూ, ఏఐటీయూసీ సంఘాల ఆధ్వర్యంలో సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఆర్డీయూ సంఘం నాయకుడు నిమ్మనగోటి శీను మాట్లాడుతూ, ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేసి, పనికి తగిన వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరల నేపథ్యంలో ప్రస్తుతం అందుతున్న జీతాలు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పెట్రోల్ ధరలు పెరగడంతో అదనపు ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నామని, పిల్లల చదువుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేవలం రూ.13 వేల వేతనంతో కుటుంబ పోషణ సాధ్యం కాదని పేర్కొన్నారు.

ప్రభుత్వం స్పందించి కార్మికుల వేతనాలను పెంచడంతో పాటు, కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో తంతనాల దయాకర్, ఫయాజుద్దీన్, జలంధర్, సతీష్, నాగరాజు, వెంకన్న, మహేష్, వెంకట్ రెడ్డి, రఘుపతి, ఫ్రాన్సిస్ తదితర కార్మికులు పాల్గొన్నారు.

Sthanikam

మిషన్ భగీరథ కార్మికుల ఆందోళన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News