Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 02:19 PM

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టిప్పర్ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్ర ఉత్కంఠ

27-05-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. మెడ్చల్ నుంచి ఆటోనగర్ వైపు వెళ్తున్న కిరాణా సరుకులతో నిండిన లారీ టైరు పగిలి అదుపుతప్పడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. RJ 10 GA 8723 నంబరు గల లారీ ఉదయం సుమారు 4 గంటల సమయంలో కెప్టెన్ కుక్ సమీపానికి చేరుకోగానే టైరు పేలింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయిన వాహనం రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న TG07 W 2459 నంబరు గల టిప్పర్ లారీ ముందున్న లారీని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ నవీన్ తీవ్రంగా గాయపడి క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీ శ్రమతో డ్రైవర్‌ను బయటికి తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదం కారణంగా కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Sthanikam

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టిప్పర్ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్ర ఉత్కంఠ

Article Image

హైదరాబాద్‌: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. మెడ్చల్ నుంచి ఆటోనగర్ వైపు వెళ్తున్న కిరాణా సరుకులతో నిండిన లారీ టైరు పగిలి అదుపుతప్పడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. RJ 10 GA 8723 నంబరు గల లారీ ఉదయం సుమారు 4 గంటల సమయంలో కెప్టెన్ కుక్ సమీపానికి చేరుకోగానే టైరు పేలింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయిన వాహనం రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న TG07 W 2459 నంబరు గల టిప్పర్ లారీ ముందున్న లారీని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ నవీన్ తీవ్రంగా గాయపడి క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీ శ్రమతో డ్రైవర్‌ను బయటికి తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదం కారణంగా కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News