Sthanikam - Truth Matters
Logo

తటికల్ గ్రామంలో ఘనంగా శ్రీ గంగాదేవి ఐదవ మహోత్సవం

Updated : 27 May 2026 05:27 IST
As Preferred Source 1 min read
తటికల్ గ్రామంలో ఘనంగా శ్రీ గంగాదేవి ఐదవ మహోత్సవం

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం తటికల్ గ్రామంలో యాదవుల కులదైవమైన శ్రీ శ్రీ శ్రీ గంగాదేవి ఐదవ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని యాదవ కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొని బోనాలు, భజనలు, కళ్యాణోత్సవాలతో పండుగను అంగరంగ వైభవంగా జరిపారు.

భక్తులు గంగాదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కుటుంబాలు, పంటలు, పశుసంపద సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. మహిళలు, యువకులు భక్తి గీతాలు పాడుతూ భజనలు నిర్వహించగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో తటికల్ గ్రామ సర్పంచ్ బంటు రవి, మాజీ ఎంపీటీసీ శ్రీలత-కొండయ్య, పెద్దగొల్ల భీమనబోయిన లింగయ్య యాదవ్, సారగొల్ల నల్లమాద నాగేష్ యాదవ్, భీమనబోయిన యాదగిరి యాదవ్, శంకర్ యాదవ్, అంజయ్య యాదవ్, గుండబోయిన దశరథ యాదవ్, దొడ్డబోయిన రాములు యాదవ్, ముచ్చబోయిన వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తటికల్ గ్రామంలో ఘనంగా శ్రీ గంగాదేవి ఐదవ మహోత్సవం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి