Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:24 AM

ఉద్యోగుల డిమాండ్లపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

17-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జూన్ 2 నాటికి పిఆర్సి అమలు చేయాలి – జేఏసీ డిమాండ్

యాదగిరిగుట్ట: రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల పెండింగ్ డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టారు. తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా యాదగిరిగుట్టలో తాసిల్దార్ గణేష్ నాయక్‌కు వినతి పత్రం అందజేశారు.

జేఏసీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా జూన్ 2 నాటికి పిఆర్సి అమలు చేయాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ను అమల్లోకి తీసుకువచ్చి అందరికీ హెల్త్ కార్డులు జారీ చేయాలని తెలిపారు.

సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపిఎస్) పునరుద్ధరించాలని, 2004 సెప్టెంబర్ 1కు ముందు నియామకమైన ఉద్యోగులకు ఓపిఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, గత ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా 61 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు చేపట్టాలని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు నారాయణ, సైదారావు, యాదగిరి, రామ్మోహన్‌రావు, రాజు, దయాకర్‌రెడ్డి, రామ్మూర్తి, గడ్డమీది పాండురంగం, అక్బర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉద్యోగుల డిమాండ్లపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News