Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:46 AM

ఉద్యమకారులకు తీపి కబురు..! ప్రత్యేక కమిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగు

13-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్యమకారుల సమస్యలు, సంక్షేమంపై చర్చించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్సీలు M. కోదండరాం మరియు అద్దంకి దయాకర్మి నిస్టర్ క్వార్టర్స్‌లో సమావేశమయ్యారు.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలనే అంశంపై ఈ సమావేశంలో ప్రాథమికంగా చర్చించారు.

ఈ కమిటీలో మహిళలు, వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో నిజమైన ఉద్యమకారులను గుర్తించేందుకు జిల్లాల వారీగా సర్వేలు నిర్వహించాలని, వారి సమస్యలు, డిమాండ్లపై సమగ్ర అధ్యయనం చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన అర్హత ప్రమాణాలు, విధివిధానాలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు.

ఈ అంశంపై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ప్రత్యేక సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల త్యాగాలు అమూల్యమైనవని, వారికి న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని నేతలు పేర్కొన్నారు.

వచ్చే వారం మరోసారి సమావేశమై కమిటీ సభ్యుల ఎంపిక, అమలు ప్రణాళికపై స్పష్టతనివ్వాలని నిర్ణయించారు. ఈ సమావేశం తెలంగాణ ఉద్యమకారుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.

Sthanikam

ఉద్యమకారులకు తీపి కబురు..! ప్రత్యేక కమిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News