Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:43 AM

ఉద్యమకారులకు న్యాయం చేస్తాం బత్తుల సోమయ్యను పరామర్శించిన మంత్రి పొంగులేటి

13-03-2026 117 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం, : తెలంగాణ ఉద్యమకారుడు బత్తుల సోమయ్యను రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి Ponguleti Srinivasa Reddy పరామర్శించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమయ్యతో పాటు ఆయన సతీమణి తీవ్రంగా గాయపడగా, చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న మంత్రి గురువారం సాయంత్రం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్ సమీపంలోని ఆటోనగర్‌లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సోమయ్య ఉద్యమకారులకు సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసిన అనేక మంది కుటుంబాలు ప్రస్తుతం దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నాయని, అమరవీరుల తల్లిదండ్రులకు సరైన ఆదరణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ముఖ్యంగా ఉద్యమకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే సబ్ కమిటీలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యమకారులకు కూడా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “సోమన్న.. మీరు సూచించిన ప్రతి అంశం న్యాయమైనదే. మీరు మీకోసం కాదు, ఉద్యమకారుల కోసమే అడుగుతున్నారు. ఈ విషయాలను ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరించేలా కృషి చేస్తాను” అని హామీ ఇచ్చారు. అలాగే ప్రమాద చికిత్సకు అయిన ఖర్చులను సీఎంఆర్‌ఎఫ్ ద్వారా అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుని త్వరగా కోలుకోవాలని సోమయ్యకు సూచించారు.

మంత్రి వెంట క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ దయాకర్ రెడ్డి, రామసహాయం నరేష్ రెడ్డి ఉన్నారు. కార్యక్రమంలో పాలకుర్తి కృష్ణ, కుక్క సత్యం, తునికిపాటి చారీ, వడ్తియా రాజేష్ నాయక్, రామాంజనేయులు, బొలికొండ పాపయ్య, జంపాని అంజయ్య, వడ్డెబోయిన వెంకటేశ్వర్లు, ఉల్లంగి పద్మ, కొక్కెర శ్రీనివాస్, కొట్టం రంజితా రెడ్డి, కొట్టం శిరీష, భూక్యా సురేష్ నాయక్, అప్పలనేని రామారావు, పసునూరి అనిల్, మోహన్ రావు, అశోక్ సింగ్, వెంపటి వెంకన్న, అంబాల రామారావు, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉద్యమకారులకు న్యాయం చేస్తాం బత్తుల సోమయ్యను పరామర్శించిన మంత్రి పొంగులేటి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News