Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:51 AM

ఉద్యమకారులకు అండగా విజయశాంతి. కృతజ్ఞతలు తెలిపిన జోగు అంజన్న

31-03-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శాసన మండలిలో ఉద్యమకారుల సమస్యలను గట్టిగా ప్రస్తావించి, వారికి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ, సినీనటి, సీనియర్ ఉద్యమకారిణి విజయశాంతికి ఉద్యమకారుల ఫోరం కృతజ్ఞతలు తెలిపింది.

ఉద్యమకారుల కోరికలు న్యాయమైనవేనని, ఇప్పటివరకు వారికి అన్యాయం జరుగుతూనే వచ్చిందని ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న పేర్కొన్నారు. సబ్ కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గత రెండేళ్ల కాలం కళ్లుమూసి తెరిచేలోపే గడిచిపోయిందని, ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతి ధైర్యంగా ముందుకు వచ్చి ఉద్యమకారుల తరఫున నిలబడటం అభినందనీయమని తెలిపారు.

ఉద్యమకారుల గౌరవాన్ని కాపాడుతూ ప్రజాప్రతినిధులను నిలదీసిన విజయశాంతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

ఉద్యమకారులకు అండగా విజయశాంతి. కృతజ్ఞతలు తెలిపిన జోగు అంజన్న

Article Image

శాసన మండలిలో ఉద్యమకారుల సమస్యలను గట్టిగా ప్రస్తావించి, వారికి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ, సినీనటి, సీనియర్ ఉద్యమకారిణి విజయశాంతికి ఉద్యమకారుల ఫోరం కృతజ్ఞతలు తెలిపింది.

ఉద్యమకారుల కోరికలు న్యాయమైనవేనని, ఇప్పటివరకు వారికి అన్యాయం జరుగుతూనే వచ్చిందని ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న పేర్కొన్నారు. సబ్ కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గత రెండేళ్ల కాలం కళ్లుమూసి తెరిచేలోపే గడిచిపోయిందని, ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతి ధైర్యంగా ముందుకు వచ్చి ఉద్యమకారుల తరఫున నిలబడటం అభినందనీయమని తెలిపారు.

ఉద్యమకారుల గౌరవాన్ని కాపాడుతూ ప్రజాప్రతినిధులను నిలదీసిన విజయశాంతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News