Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:29 AM

ఉద్యమకారుల మహాసభకు భారీ ఏర్పాట్లు. జోగు అంజన్న

17-04-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

33 జిల్లాల నుంచి తరలిరండి.. హక్కుల సాధనకు ఐక్యంగా పోరాటం

హైదరాబాద్ (తార్నాక): ఉద్యమకారుల హక్కుల సాధన కోసం రాష్ట్రస్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న తెలిపారు. డాక్టర్ చీమ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం తార్నాకలోని మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఈ మహాసభ జరగనుంది.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఉద్యమకారులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 18వ తేదీ ఉదయం 9.30 గంటలకు తార్నాక చౌరస్తా నుంచి ర్యాలీగా ఫంక్షన్ హాల్‌కు చేరుకుని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం కొనసాగుతుందని తెలిపారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ విజయశాంతి, ఉద్యమ నాయకులు కోదండరాం తదితరులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, గుర్తింపు కోసం సబ్ కమిటీని త్వరగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తొలి, మలిదశ ఉద్యమకారుల్లో అనేక మంది ఇప్పటికే కనుమరుగైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం, ₹25 వేల పెన్షన్, ₹10 వేల కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, గుర్తింపు కార్డులు జారీ చేసి బస్సులు, రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు.

Sthanikam

ఉద్యమకారుల మహాసభకు భారీ ఏర్పాట్లు. జోగు అంజన్న

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News