Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:10 PM

ఉద్యమకారుల గుర్తింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.జోగు అంజన్న

07-03-2026 84 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కేంద్రంలో ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి వారి డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రకటించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా రామన్నపేట మండల కమిటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం రామన్నపేట మండల వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అమరులైన నారపాక మల్లయ్య, బొల్లెపల్లి కళింగరాజు, బొడిగ లక్ష్మయ్య, అడ్వకేట్ వాసుదేవరావు, విక్రమ్ సింగ్ ఠాకూర్, గడ్డం స్వామి, మోటే అంజన్న, ఏలూరు కుమారస్వామి తదితరులను స్మరించుకున్నారు. వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మండలంలోని అర్హులైన ప్రతి ఉద్యమకారునికి 250 గజాల స్థలం, రూ.25 వేల పింఛన్‌తో పాటు గుర్తింపు కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం మండల నోముల శంకర్, ఉద్యమకారులు బందెల రాములు,సాల్వేరు అశోక్,రెబ్బాసు రాములు, బొడ్డుపల్లి లింగన్న, పాండురంగాచారి, గడ్డం యాదగిరి, ఏలూరు రవి, యాదాసు లక్ష్మణ్, ఆవుల నరేందర్, కొండ మల్లేశం గౌడ్ , మధ్యగల నరసింహ, ఎండి ఇమామ్ సాబ్, గొలుసుల ప్రసాద్, ఎండి అజార్, నంగునూరు విజయ్, వంగాల యాదన్న, నారపాక అశోక్, నక్క శంకరయ్య, మందడి రవీందర్ రెడ్డి, బెడితే లింగం, స్కైలాబ్, పెండెం రవీందర్, మారోజు శ్రీనివాసచారి, దోమల యాదయ్య, దోమల ముత్తయ్య, మహిళా నాయకురాలు నర్రా అందాలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉద్యమకారుల గుర్తింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.జోగు అంజన్న

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News