తుంగతుర్తి;యువతను పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారికి దూరంగా ఉండాలని తుంగతుర్తి సబ్ ఇన్స్పెక్టర్ (SI) క్రాంతి కుమార్ పి లుపునిచ్చారు. తుంగతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు స్థానిక ప్రజలు, యువతకు మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. డ్రగ్స్ అలవాటు వల్ల జీవితాలు ఎలా నాశనమవుతాయో వివరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఉన్నతమైన లక్ష్యాల వైపు అడుగులు వేయాలని కోరారు. గంజాయి లేదా ఇతర నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక యువకులు, ప్రజలు పాల్గొన్నారు.
PRINT TIME: September 08, 2026 01:37 PM
తుంగతుర్తి;మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు.

23-07-2026
15 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి;యువతను పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారికి దూరంగా ఉండాలని తుంగతుర్తి సబ్ ఇన్స్పెక్టర్ (SI) క్రాంతి కుమార్ పి లుపునిచ్చారు. తుంగతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు స్థానిక ప్రజలు, యువతకు మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. డ్రగ్స్ అలవాటు వల్ల జీవితాలు ఎలా నాశనమవుతాయో వివరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఉన్నతమైన లక్ష్యాల వైపు అడుగులు వేయాలని కోరారు. గంజాయి లేదా ఇతర నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి