Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:25 AM

తుంగభద్ర డ్యాం గేట్ల పనుల పరిశీలన.దేవేంద్రప్ప

17-04-2026 136 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాయలసీమకు నీటి భరోసా.. మరమ్మత్తులు వేగవంతం చేయాలని ఆదేశం

హొస్పేట్ (కర్ణాటక): రాయలసీమ ప్రాంతానికి జీవనాడిగా నిలిచిన తుంగభద్ర డ్యాం గేట్ల మరమ్మత్తు పనులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతం వెనుకబడినదిగా గుర్తింపు పొందినప్పటికీ ప్రతి ఎకరాకు నీరందించాలన్న లక్ష్యంతో చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఈ డ్యాం కీలకమని పేర్కొన్నారు.

గత ఏడాది డ్యాం గేట్లు దెబ్బతిన్న నేపథ్యంలో ఈసారి కొత్త గేట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు సమన్వయంతో చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచనల మేరకు పనులు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.

Sthanikam

తుంగభద్ర డ్యాం గేట్ల పనుల పరిశీలన.దేవేంద్రప్ప

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News