Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:29 AM

తిరువూరు ఎమ్మెల్యే, ఎంపీల తీరుపై కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు ఘాటు విమర్శలు

07-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో రాజకీయ వర్గపోరు ప్రజలలో చర్చనీయాంశంగా మారిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లెపాటి శ్రీనివాసరావు విమర్శించారు. తిరువూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి మరియు పార్లమెంటు సభ్యుడు కేశినేని మధ్య జరుగుతున్న వర్గపోరు నియోజకవర్గ అభివృద్ధికి అడ్డంకిగా మారిందని ఆయన ఆరోపించారు. ఇసుక, మట్టి, రేషన్, లిక్కర్ వ్యాపారాల లావాదేవీలలో వచ్చిన విభేదాల కారణంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరిస్తున్నారని మండిపడ్డారు.

తిరువూరు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించకుండా రాజకీయ లాభాల కోసం మహిళలను కూడా వివాదాల్లోకి లాగడం సిగ్గుచేటు చర్య అని ఆయన విమర్శించారు. సత్యం, ధర్మం, న్యాయం బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముని పేరును కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం తగదన్నారు.

గంపలగూడెం మండలంలో కట్లేరు వాగుపై నిర్మించాల్సిన వంతెన పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని, నిధులు వచ్చాయని చెబుతున్నా వాస్తవానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాలేదని పేర్కొన్నారు. నిజంగా నిధులు మంజూరు అయ్యుంటే వంతెన పనులు ఎప్పుడో ప్రారంభమయ్యేవని అన్నారు.

ఎంపీ, ఎమ్మెల్యే డ్రామా రాజకీయాలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేస్తున్నారని, తమను ఎన్నుకున్న ప్రజలను మోసం చేస్తున్నారని పల్లెపాటి శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు.

Sthanikam

తిరువూరు ఎమ్మెల్యే, ఎంపీల తీరుపై కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు ఘాటు విమర్శలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News