Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:30 AM

తాటి చెట్టు నుంచి జారి గీత కార్మికుడు తీవ్ర గాయాలు

20-04-2026 451 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన గీత కార్మికుడు మట్ట చిన్న బాలరాజు గౌడ్ తాటి చెట్టు ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం ఉదయం వృత్తి నిర్వహణలో భాగంగా చెట్టు ఎక్కిన ఆయనకు ఎండ వేడి కారణంగా కాళ్లకు చెమటలు రావడంతో జారి పడినట్లు స్థానికులు తెలిపారు.

గాయపడిన బాలరాజును వెంటనే భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని సుప్రజ ఆసుపత్రికి మార్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

ఇటీవల కాలంలోనే నందనం గ్రామంలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయి. గత ఏడాదిలో నలుగురు గీత కార్మికులు తాటి చెట్లపై నుంచి పడి తీవ్ర గాయాలకు గురై వృత్తిని మానివేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో వారి కుటుంబాలు జీవనాధారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో గౌడ సంఘ మండల అధ్యక్షుడు నాగేల్లి సత్యనారాయణ గౌడ్ ప్రభుత్వాన్ని కోరుతూ, గీత కార్మికుల భద్రత కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదాల్లో మరణించిన వారికి రూ.10 లక్షలు, వికలాంగులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఒక నెలలోపు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Sthanikam

తాటి చెట్టు నుంచి జారి గీత కార్మికుడు తీవ్ర గాయాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News