Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:27 AM

తాజ్‌పూర్‌లో నూతన మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన

29-05-2026 101 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహిళా సాధికారతకు మరింత బలం చేకూర్చనున్న ‘వీఓ బిల్డింగ్’

గ్రామ అభివృద్ధికి పాలకవర్గం కృషి అభినందనీయం

మహిళా సాధికారత, సంఘ సమావేశాల నిర్వహణ కోసం తాజ్‌పూర్ గ్రామ పంచాయితీకి నూతనంగా మంజూరైన మహిళా భవనం (వీఓ బిల్డింగ్) నిర్మాణానికి శుక్రవారం ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎంపీడీవో దినకర్, పీఆర్ఏఈ శ్యామ్ సుందర్ రెడ్డి, సామాజికవేత్త డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత అభివృద్ధి చెందేందుకు ఈ మహిళా భవనం ఎంతో ఉపయోగపడుతుందని సర్పంచ్ పేర్కొన్నారు. మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యకలాపాలకు ఈ భవనం కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, వారి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు పేర్కొన్నారు. మహిళా సంఘాల బలోపేతానికి ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వరిగంటి కృష్ణ, పంచాయితీ కార్యదర్శి బి.నరేందర్, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, మహ్మద్ గాలిబీ యాకూబ్, బొమ్మారపు రామకృష్ణ, బొమ్మారపు లక్ష్మి బాలరాజ్, బీట్కురి మహేష్, వరిగంటి మానస నాగరాజు, షేక్ అహ్మద్ పాల్గొన్నారు.

అలాగే సంఘ బంధం అధ్యక్షురాలు వరిగంటి రమ్య, సభ్యులు గుల్వాని రమ్య, బొమ్మారపు శ్రీలత, వీఏకే బొమ్మారపు అనురాధలతో పాటు వివిధ మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

తాజ్‌పూర్‌లో నూతన మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News