Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:32 AM

తైబజార్ వేలం రూ.1.68 లక్షలకు కుదిరింది.15 మంది పోటీ మధ్య లగ్గోని యాదగిరి సొంతం.

18-04-2026 229 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట గ్రామపంచాయతీ పరిధిలోని తైబజార్ వేలం పాట శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ గరిక సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. వేలంపాటలో పాల్గొనడానికి రూ.10 వేల డిపాజిట్ చెల్లించిన 15 మంది పోటీదారులు హాజరయ్యారు.

సర్కారు నిర్ణయించిన ప్రారంభ ధర రూ.77 వేలుగా ఉండగా, పట్టణానికి చెందిన లగ్గోని యాదగిరి అత్యధికంగా రూ.1.68 లక్షలు పలికి తైబజార్ హక్కులను దక్కించుకున్నారు.

వేలంపాట అనంతరం సర్పంచ్, కార్యవర్గ సభ్యులు మరియు పంచాయతీ కార్యదర్శి సైదిరెడ్డి విజేతను అభినందించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ, వేలం విజేత రెండు రోజులలో 50 శాతం మొత్తాన్ని, మిగతా 50 శాతం వచ్చే సంవత్సరం జనవరి 5 లోపు పూర్తిగా చెల్లించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోటే రమేష్, వార్డు సభ్యులు సుర్వి హరిబాబు, గొరిగే శేఖర్, జాడ సంతోష్, అలాగే నాయకులు సాల్వేరు అశోక్, కందుల హనుమంతు, నకిరేకంటి సుదర్శన్, కోట సుధాకర్, పల్లపు రవి, ఊట్కూరి శ్రీను, ఊరే శేఖర్, బండ లింగస్వామి, గొలుసుల ప్రసాద్, నాసర్, మాండ్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తైబజార్ వేలం రూ.1.68 లక్షలకు కుదిరింది.15 మంది పోటీ మధ్య లగ్గోని యాదగిరి సొంతం.

Article Image

రామన్నపేట గ్రామపంచాయతీ పరిధిలోని తైబజార్ వేలం పాట శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ గరిక సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. వేలంపాటలో పాల్గొనడానికి రూ.10 వేల డిపాజిట్ చెల్లించిన 15 మంది పోటీదారులు హాజరయ్యారు.

సర్కారు నిర్ణయించిన ప్రారంభ ధర రూ.77 వేలుగా ఉండగా, పట్టణానికి చెందిన లగ్గోని యాదగిరి అత్యధికంగా రూ.1.68 లక్షలు పలికి తైబజార్ హక్కులను దక్కించుకున్నారు.

వేలంపాట అనంతరం సర్పంచ్, కార్యవర్గ సభ్యులు మరియు పంచాయతీ కార్యదర్శి సైదిరెడ్డి విజేతను అభినందించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ, వేలం విజేత రెండు రోజులలో 50 శాతం మొత్తాన్ని, మిగతా 50 శాతం వచ్చే సంవత్సరం జనవరి 5 లోపు పూర్తిగా చెల్లించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోటే రమేష్, వార్డు సభ్యులు సుర్వి హరిబాబు, గొరిగే శేఖర్, జాడ సంతోష్, అలాగే నాయకులు సాల్వేరు అశోక్, కందుల హనుమంతు, నకిరేకంటి సుదర్శన్, కోట సుధాకర్, పల్లపు రవి, ఊట్కూరి శ్రీను, ఊరే శేఖర్, బండ లింగస్వామి, గొలుసుల ప్రసాద్, నాసర్, మాండ్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News