Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:44 AM

తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

11-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోటకొండూర్: నూతనంగా నిర్మిస్తున్న మండల తహసీల్దార్ కార్యాలయ భవన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

బుధవారం మోటకొండూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. నిర్మాణ పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. భవనం పూర్తి కావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా కార్యాలయ భవనం నిర్మించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, పనులను నిర్లక్ష్యం చేయకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

తహసీల్దార్ కార్యాలయం పూర్తయితే మండల ప్రజలకు రెవెన్యూ సంబంధిత సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రాజేంద్ర ప్రసాద్, ఎంపీడీఓ ఇందిర, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News