Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:51 AM

తాజ్పూర్ గ్రామపంచాయతీలో ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు

03-01-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహిళా విద్యకు ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం

భువనగిరి స్థానికం ప్రతినిధి
భువనగిరి మండల పరిధిలోని తాజ్పూర్ గ్రామంలో సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్,కార్యదర్శి నరేంద్ర ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి ఫూలే ఆడపిల్లల విద్య కోసం,మహిళల స్వేచ్ఛా హక్కుల సాధన కోసం చేసిన పోరాటం దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని పేర్కొన్నారు. విద్యే ఆయుధంగా సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆమె ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు.సావిత్రిబాయి ఫూలే చూపిన మార్గంలో నడిచి, మహిళా విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సామాజికవేత్త డాక్టర్ ర్యాలక శ్రీనివాస్,ఉప సర్పంచ్,వరిగంటి కృష్ణ,వార్డు సభ్యులు మహమ్మద్ మహమ్మద్ గాలిబ్బు యాకుబ్,పల్లెపాటి కృష్ణ,బొమ్మరపు రామకృష్ణ,బొమ్మరపు లక్ష్మీ బాలరాజు,బి.మహేష్,వరిగంటి మానస నాగరాజు,షేక్,అహ్మద్,అగ్రికల్చర్ విద్యార్థులు,గ్రామపంచాయతీ సిబ్బంది,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Sthanikam

తాజ్పూర్ గ్రామపంచాయతీలో ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News