Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:30 AM

తెలంగాణపై వ్యాఖ్యలు దేశద్రోహమే: కాంగ్రెస్ నేతలు

17-04-2026 291 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తేజస్వీ సూర్య క్షమాపణ చెప్పాలి.. ఎంపీ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్

రామన్నపేట: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చడం దేశద్రోహానికి సమానమని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ మహమ్మద్ జమీరుద్దీన్, రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్లమెంట్‌లో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అవమానించేలా మాట్లాడటం తగదని పేర్కొన్నారు. తేజస్వీ సూర్య వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, పార్లమెంట్ సాక్షిగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.

దశాబ్దాల పోరాటం, అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. బీజేపీ అగ్రనాయకత్వం ఉద్దేశపూర్వకంగానే తెలంగాణపై దాడులు చేస్తోందని విమర్శించారు.

తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఈ అంశంపై మౌనం పాటించడం విచారకరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉపసర్పంచ్ మోటి రమేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టే సంతోష్ కుమార్, నాయకులు ఎండి నాసర్, వెంకటేశం, మొహమ్మద్ బషీర్, దౌల, ఎండి అక్రమ్, మీర్జా అస్లాం బేగ్, గొలుసుల ప్రసాద్, గొరిగ శేఖర్, బండ లింగస్వామి, ఎండి రిజ్వాన్, ఎండి జానీ, సహదేవ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణపై వ్యాఖ్యలు దేశద్రోహమే: కాంగ్రెస్ నేతలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News