Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:20 PM

తెలంగాణ ఉద్యమ కారుల ఆకాంక్షలను నెరవేర్చాలి

02-06-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని 2009 తెలంగాణ ఉద్యమకారులు కోరారు, మంగళవారం మండల కేంద్రంలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని రాష్ట్రం సిద్ధించడం కోసం అనేక త్యాగాలు చేసి పోరాడిన ఉద్యమకారులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు, రాష్ట్ర సాధనలో ఎందరో యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని అనేకమంది ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులపై కేసులు నమోదయి జైలుకు కూడా వెళ్లారని అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి సరైన న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కాలయాపన చేసి చివరికి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు కేశవరావు కమిటీ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు, తెలంగాణ ఉద్యమములో వంట వార్పు, రోడ్ల దిగ్బంధన, తెలంగాణ ధూమ్ ధామ్ తదితర కార్యక్రమాలు చేసి తెలంగాణ ప్రజలను చైతన్యవంతులు చేసిన పాత్ర మరువలేనిదని అన్నారు, ఉద్యమ సమయంలో అనేక మంది యువకులు పోలీసుల దెబ్బలు తిని జైలు కూడా వెళ్లారని అన్నారు, రాష్ట్ర సాధించిన అనంతరం ఉద్యమకారుల బతుకులు బాంచన్ బతుకులుగా మారాయని అన్నారు ఇప్పటికే అనేకమంది తెలంగాణ ఉద్యమకారులు వివిధ జబ్బులతో అనారోగ్యాలతో మరణించారని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలతో పాటు ఉద్యమంలో క్రియాశీలకమైన వారిని గుర్తించి వారికి నెలకు 25 వేల పెన్షన్, మరియు 250 గజాల ఇంటి స్థలము, ప్రతి ఉద్యమకారుడికి ఉచిత బస్సు పాస్ సౌకర్యం, హెల్త్ కార్డు కల్పించాలని డిమాండ్ చేశారు, అలాగే తెలంగాణ ఉద్యమకారుల కోసం పది వేల కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని కోరారు అందులో ఉద్యమ సమయంలో జైలు పాలే మరణించిన తెలంగాణ అమరులకు ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం, పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ ఉద్యోగ కారుల గౌరవాధ్యక్షులు పాలవరపు సంతోష్, నాయకులు ఎండి నసీరుద్దీన్, దుగ్యాల రవీందర్రావు, ఎల్లబోయిన బిక్షం, కటకం వెంకన్న, ఎండి జానీ, బిడిద రాములు, బానోతు భగవాన్, చెన్నా రామ్మూర్తి, శీలం మల్లయ్య, చింతకుంట్ల వెంకన్న, గులోతుపాపులు, యాకయ్య, దేశ మల్ల భాగ్యమ్మ, సుధాకర్ రెడ్డి, పుల్లయ్య, కాసం మల్లయ్య, ఆకారపు రామయ్య, తదితరులు పాల్గొన్నారు

Sthanikam

తెలంగాణ ఉద్యమ కారుల ఆకాంక్షలను నెరవేర్చాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News