Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:12 PM

తెలంగాణ మీ జాగీరా..? అడ్డుకుంటే చూస్తా..!" — కాంగ్రెస్‌కు పవన్ కళ్యాణ్ సవాల్

02-06-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

హైదరాబాద్: తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో తాను పర్యటించకుండా ఎవరూ అడ్డుకోలేరని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతానని స్పష్టం చేశారు.

"తెలంగాణ ఎవరి జాగీరు కాదు. ఇది భారతదేశంలో అంతర్భాగం. నా దేశంలో నేను ఎక్కడికైనా వెళ్తాను. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలంటే వీసా తీసుకోవాలా?" అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

తెలంగాణ పట్ల తనకు ఉన్న నిబద్ధత కారణంగానే కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ అభివృద్ధికి రూ.30 కోట్ల నిధులు కేటాయించానని గుర్తు చేశారు. అయినప్పటికీ తనపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

కాంగ్రెస్ నేతలు తెలంగాణలో ఎలా తిరుగుతావని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని పవన్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కేరళలో పోటీ చేయొచ్చు, ఇందిరా గాంధీ మెదక్‌లో పోటీ చేయొచ్చు. కానీ మేము తెలంగాణకు వస్తే అడ్డుకుంటారా?" అని నిలదీశారు.గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తుచేసిన ఆయన, తాను ఎవరినీ చూసి భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన పార్టీ తప్పకుండా ఉంటుందని, పార్టీ విస్తరణను ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు.అలాగే తనపై వచ్చిన చెరువు కబ్జా ఆరోపణలను కూడా పవన్ ఖండించారు. "నేను ఏ చెరువును కబ్జా చేయలేదు. కబ్జా చేసి ఉంటే చట్టం ఊరుకునేదా? ఆధారాలు ఉంటే చూపించండి" అని సవాల్ విసిరారు.

కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు జాతీయ పార్టీకి తగిన విధంగా లేదని విమర్శించిన పవన్ కళ్యాణ్, "ఇది ఏంటి హిపోక్రసీ?" అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

— రాజకీయ వర్గాల్లో పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి.

Sthanikam

తెలంగాణ మీ జాగీరా..? అడ్డుకుంటే చూస్తా..!" — కాంగ్రెస్‌కు పవన్ కళ్యాణ్ సవాల్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News