Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:28 PM

"తెలంగాణ మా తండ్రి, తాతల జాగీరు కాదు.. ప్రజల ఆత్మగౌరవ ఫలితం" — పవన్ వ్యాఖ్యలకు పొన్నం ఘాటు కౌంటర్

02-06-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తెలంగాణపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ దుమారం రేపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర మంత్రిపొన్నం ప్రభాకర్ ఘాటుగా ప్రతిస్పందించారు. తెలంగాణ ఎవరి వ్యక్తిగత జాగీరు కాదని, ఇది ప్రజల పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం అని స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్లో మరోసారి అహంకారం కనిపించిందని మంత్రి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోనే తన రాజకీయ స్థితిగతులపై అనిశ్చితి ఉన్న నేపథ్యంలో తెలంగాణపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ ఎప్పుడైనా మద్దతుగా నిలిచారా? అమరవీరుల కుటుంబాలకు అండగా ఉన్నారా? అని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం వేలాది మంది చేసిన త్యాగాలను విస్మరించి మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించకుండా మాట్లాడితే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన నాయకులు ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని మంత్రి సూచించారు. తెలంగాణపై పవన్ కల్యాణ్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కారని ఆరోపించారు.

రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారగా, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మాటల యుద్ధానికి తెరలేపినట్లు కనిపిస్తోంది.

Sthanikam

"తెలంగాణ మా తండ్రి, తాతల జాగీరు కాదు.. ప్రజల ఆత్మగౌరవ ఫలితం" — పవన్ వ్యాఖ్యలకు పొన్నం ఘాటు కౌంటర్

Article Image

తెలంగాణపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ దుమారం రేపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర మంత్రిపొన్నం ప్రభాకర్ ఘాటుగా ప్రతిస్పందించారు. తెలంగాణ ఎవరి వ్యక్తిగత జాగీరు కాదని, ఇది ప్రజల పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం అని స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్లో మరోసారి అహంకారం కనిపించిందని మంత్రి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోనే తన రాజకీయ స్థితిగతులపై అనిశ్చితి ఉన్న నేపథ్యంలో తెలంగాణపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ ఎప్పుడైనా మద్దతుగా నిలిచారా? అమరవీరుల కుటుంబాలకు అండగా ఉన్నారా? అని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం వేలాది మంది చేసిన త్యాగాలను విస్మరించి మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించకుండా మాట్లాడితే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన నాయకులు ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని మంత్రి సూచించారు. తెలంగాణపై పవన్ కల్యాణ్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కారని ఆరోపించారు.

రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారగా, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మాటల యుద్ధానికి తెరలేపినట్లు కనిపిస్తోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News