Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:31 AM

తెలంగాణ ఏర్పాటు‌ను ‘భారత్-పాక్ విభజన’తో పోల్చడం దేశద్రోహం: బీఆర్‌ఎస్‌వీ నేత ఆగ్రహం

17-04-2026 118 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్, :

పార్లమెంట్ ఆమోదంతో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ‘భారత్-పాకిస్తాన్ విభజన’తో పోల్చడం దేశద్రోహానికి సమానమని బీఆర్‌ఎస్‌వీ నకిరేకల్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు జెట్టి శివ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్ చట్టం ద్వారా, భారత రాజ్యాంగ పరిరక్షణలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తక్కువ చేసి చూపడం అసహనీయమన్నారు. ఈ వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని, పార్లమెంట్ సాక్షిగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని తేజస్వీ సూర్యతో పాటు బీజేపీ అగ్రనాయకత్వాన్ని డిమాండ్ చేశారు.

దశాబ్దాల పోరాటం, వేలాది మంది అమరుల త్యాగాలు, ప్రజల దీర్ఘకాల ఆకాంక్షల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని ఆయన గుర్తుచేశారు. అలాంటి చారిత్రాత్మక ప్రక్రియను వక్రీకరించడం తగదన్నారు.

అలాగే, తెలంగాణ ప్రజల ఓట్లతో ఎన్నికైన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఈ అంశంపై స్పందించకపోవడం బాధాకరమని, ప్రజల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంపై ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

Sthanikam

తెలంగాణ ఏర్పాటు‌ను ‘భారత్-పాక్ విభజన’తో పోల్చడం దేశద్రోహం: బీఆర్‌ఎస్‌వీ నేత ఆగ్రహం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News