Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:26 PM

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా.

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా.

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా.
03-06-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాలలో ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాక ఆవిష్కరణ.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్యాల పట్టణంలో సోమవారం పలు ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో విజయ్‌కుమార్,

ఎంపీడీవో కార్యాలయంలో ఇన్‌చార్జి ఎంపీడీవో మనోహర్,

పోలీస్ స్టేషన్‌లో సీఐ నాగరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి .

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం నిర్వహించిన కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అనేక ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో విశేష పురోగతి సాధించిందని తెలిపారు. దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతున్నదని, యువతకు ఉపాధి అవకాశాల కల్పనతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని వివరించారు.భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమైన తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతుండగా, ఈ అభివృద్ధి యాత్రలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, రాజకీయ నాయకులు, సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News