Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన బాధ్యతలు చేపట్టిన రాజు పటేల్‌కు ఘన స్వాగతం కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 04:54 AM

తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు; ఎమ్మెల్యే సామెల్

తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు; ఎమ్మెల్యే సామెల్

తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు; ఎమ్మెల్యే సామెల్
June 02, 2026 08:42 PM 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

అనేక సంవత్సరాలు కొట్లాడి ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితంగా సోనియా గాంధీ సహకారంతో తెలంగాణ రావడం జరిగిందని, అట్లాంటి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినవారిని సహించేది లేదని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సి ఎం పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినారు.భారత దేశ చరిత్రలోనే తెలంగాణ సాధనకు ఒక ప్రత్యేక స్థానం ఉందని అన్నారు .రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తి దేశంలో ఎక్కడైనా జీవించవచ్చని అయినంత మాత్రాన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదని అన్నారు. జూనియర్ సివిల్ కోర్టు, తహసిల్దార్ కార్యాలయం, పోలీస్ కార్యాలయం తోపాటు మండల కేంద్రం, మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, పార్టీ కార్యాలయాలలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినారు.కార్యక్రమములో తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, పోలే పాక రామచంద్రు, రేగటి రవి, సంజీవ, సర్పంచ్ మల్లేష్, పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News