Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:35 AM

టీజీఎస్ ఆర్టీసీలో ఘనంగా జాతీయ భద్రతా వారోత్సవాలు

04-03-2026 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

ఉద్యోగుల భద్రతకే మా తొలి ప్రాధాన్యత : వీసీ & ఎండీ వై.నాగిరెడ్డి.

​జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలు, వర్క్‌షాప్‌లు మరియు ఉత్పత్తి యూనిట్లలో భద్రతా వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం అన్ని యూనిట్లలో 'భద్రతా దినోత్సవాన్ని' నిర్వహించి, సిబ్బందికి భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించారు.

​ఈ సందర్భంగా హైదరాబాద్ బస్ భవన్ లో టీజీఎస్ ఆర్టీసీ వీసీ & ఎండీ వై.నాగిరెడ్డి మాట్లాడుతూ.కార్పొరేషన్‌లో పనిచేసే ప్రతి ఉద్యోగి, సూపర్వైజర్ ల భద్రత సంబంధిత అధికారులు తమ ప్రాథమిక బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ "కార్మికులు, ఉద్యోగుల భద్రతే మా ప్రధాన ధ్యేయమని. బస్ డిపోలు , వర్క్‌షాప్‌లలో భారీ యంత్రాలు, వెల్డింగ్ పరికరాలు, ఇంధన నిర్వహణ వంటి క్లిష్టమైన పనులు చేసేటప్పుడు కార్మికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి" అని ఆయన సూచించారు.

ప్రతి సంవత్సరం మార్చి 4న జాతీయ భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటామని, ఈ ఏడాది వారం రోజుల పాటు అట్టడుగు స్థాయి వరకు అవగాహన కల్పించేలా భద్రతా వారోత్సవాలు నిర్వహించేలా అన్ని గ్యారేజీలు, జోనల్ వర్క్‌షాప్‌లు మరియు బాడీ బిల్డింగ్ యూనిట్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎండీ నాగిరెడ్డి తెలిపారు.

సురక్షితమైన పని వాతావరణం వల్ల ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ లభించడమే కాకుండా, సంస్థ యొక్క ఖ్యాతి కూడా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యాలు

ప్రమాదాల నివారణ : యాంత్రిక గాయాలు, విద్యుత్ షాక్‌లు మరియు అగ్ని ప్రమాదాలను అరికట్టడం.

నిరంతర అభ్యాసం మరియు అవగాహన ద్వారా పని ప్రదేశాల్లో బలమైన భద్రతా వాతావరణాన్ని నిర్మించడం.

వృత్తిపరమైన ఆరోగ్య సమస్యలు మరియు రసాయన పొగలకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం.

ఉత్పాదకత పెంపు

సురక్షితమైన పని పద్ధతుల ద్వారా సంస్థ ఆస్తులను కాపాడుతూ, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం.

​ఈ కార్యక్రమంలో సిహెచ్.వెంకన్న, ఈడీ ( ఇ & ఎఎమ్ ), పలువురు ఉన్నతాధికారులు పాల్గొని భద్రతా ప్రతిజ్ఞ చేశారు.

Sthanikam

టీజీఎస్ ఆర్టీసీలో ఘనంగా జాతీయ భద్రతా వారోత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News