Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:11 PM

టైక్వాండో పోటీల్లో స్వర్ణ విజేతగా నిలిచిన నాగార్జున కళాశాల విద్యార్థి

04-03-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: నల్గొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల (ఆటానమస్)కు చెందిన ఎన్. మనోజ్ యాదవ్ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్ కళాశాల టైక్వాండో పోటీలలో అద్భుత ప్రతిభ కనబరచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2025–26 సంవత్సరానికి నిర్వహించిన ఈ పోటీలలో 80 కిలోల లోపు విభాగంలో అతడు ప్రథమ స్థానం సాధించి కళాశాలకు కీర్తి తీసుకొచ్చాడు.

ఈ విజయంతో మనోజ్ యాదవ్ అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. మార్చి 16 నుంచి 20 వరకు పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ పట్టణంలో డేవ్ విశ్వవిద్యాలయంలో జరగనున్న పోటీలలో పాల్గొననున్నాడు.

విద్యార్థి విజయంపై కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక వర్గం హర్షం వ్యక్తం చేశారు. శారీరక విద్య విభాగాధిపతి డాక్టర్ అదే మల్లేశం మార్గదర్శకత్వంలో క్రమశిక్షణతో సాధన చేసి ఈ స్థాయికి చేరుకున్నాడని పేర్కొన్నారు. క్రీడలతో పాటు విద్యలోనూ రాణించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎం. వెంకటరెడ్డి, డాక్టర్ వెంకటేశం, నర్సింగ్ కోటయ్య, మన్నెం వెంకటయ్యతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొని మనోజ్‌ను అభినందించారు. కళాశాల విద్యార్థులకు అతని విజయం గర్వకారణంగా నిలిచింది.

Sthanikam

టైక్వాండో పోటీల్లో స్వర్ణ విజేతగా నిలిచిన నాగార్జున కళాశాల విద్యార్థి

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News