Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:35 AM

సృష్టికి మూలం స్త్రీ – ప్రతి ఆడబిడ్డను తల్లిగా చూడాలి : మౌలానా మొహమ్మద్ ఇలియాజ్

08-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: పవిత్ర రంజాన్ మాసంలో 18వ ఉపవాస దీక్షను ముస్లిం మైనారిటీ సోదరులు ఆదివారం ప్రారంభించారు. సోమందేపల్లిలోని జామియా మసీదులో తెల్లవారుజామున ఫజర్ నమాజ్ అనంతరం ఈ ఉపవాస దీక్ష మొదలైంది.

ఈ సందర్భంగా మౌలానా మొహమ్మద్ ఇలియాజ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రసంగించారు. స్త్రీ లేకపోతే జననం లేదని, స్త్రీ లేకుంటే జీవితం లేదని, అసలు ఈ సృష్టి కూడా ఉండదని తెలిపారు.

స్త్రీ ఓ తల్లిగా, అక్కగా, చెల్లిగా, స్నేహితురాలిగా, భార్యగా, కూతురుగా అనేక పాత్రల్లో సమాజంలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉందన్నారు. ప్రతి ఒక్కరు ప్రతి స్త్రీలో తమ తల్లి, అక్క, చెల్లిని చూసి గౌరవించాలన్నారు.

ప్రతి స్త్రీకి అల్లాహ్ తోడుగా ఉండాలని, వారు కోరుకున్న ప్రతి కార్యంలో విజయం సాధించాలని ప్రార్థించారు. ప్రతి మగాడు స్త్రీని గౌరవించి, వారికి తోడుగా, నీడగా ఉండి, జీవితంలో సహాయకుడిగా ఉండాలని సూచించారు.

అనంతరం మౌలానా మొహమ్మద్ ఇలియాజ్ ప్రత్యేక దువా చేశారు

Sthanikam

సృష్టికి మూలం స్త్రీ – ప్రతి ఆడబిడ్డను తల్లిగా చూడాలి : మౌలానా మొహమ్మద్ ఇలియాజ్

Article Image

సోమందేపల్లి: పవిత్ర రంజాన్ మాసంలో 18వ ఉపవాస దీక్షను ముస్లిం మైనారిటీ సోదరులు ఆదివారం ప్రారంభించారు. సోమందేపల్లిలోని జామియా మసీదులో తెల్లవారుజామున ఫజర్ నమాజ్ అనంతరం ఈ ఉపవాస దీక్ష మొదలైంది.

ఈ సందర్భంగా మౌలానా మొహమ్మద్ ఇలియాజ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రసంగించారు. స్త్రీ లేకపోతే జననం లేదని, స్త్రీ లేకుంటే జీవితం లేదని, అసలు ఈ సృష్టి కూడా ఉండదని తెలిపారు.

స్త్రీ ఓ తల్లిగా, అక్కగా, చెల్లిగా, స్నేహితురాలిగా, భార్యగా, కూతురుగా అనేక పాత్రల్లో సమాజంలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉందన్నారు. ప్రతి ఒక్కరు ప్రతి స్త్రీలో తమ తల్లి, అక్క, చెల్లిని చూసి గౌరవించాలన్నారు.

ప్రతి స్త్రీకి అల్లాహ్ తోడుగా ఉండాలని, వారు కోరుకున్న ప్రతి కార్యంలో విజయం సాధించాలని ప్రార్థించారు. ప్రతి మగాడు స్త్రీని గౌరవించి, వారికి తోడుగా, నీడగా ఉండి, జీవితంలో సహాయకుడిగా ఉండాలని సూచించారు.

అనంతరం మౌలానా మొహమ్మద్ ఇలియాజ్ ప్రత్యేక దువా చేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News