Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:02 AM

సూర్యాపేట 33వ వార్డు విద్యానగర్‌ నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిగా కొన్నె మంజుల గౌడ్ బరిలో

18-01-2026 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డు (విద్యానగర్) జనరల్ రిజర్వేషన్‌గా ఖరారైన నేపథ్యంలో, ఈ వార్డు నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున కొన్నె మంజుల గౌడ్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా కొన్నె మంజుల గౌడ్ మాట్లాడుతూ, గతంలో బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్‌వో) గా సేవలందించిన అనుభవంతో ప్రజల సమస్యలు, ఓటర్ల అవసరాలు తనకు పూర్తిగా తెలుసునని తెలిపారు. బీఎల్‌వోగా పనిచేసిన కాలంలో నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించడంతో పాటు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండడం వల్ల వార్డు ప్రజలకు తాను సుపరిచితురాలినని పేర్కొన్నారు. 33వ వార్డు అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు వంటి సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రజల నమ్మకంతో కౌన్సిలర్‌గా గెలిపించాలని ఆమె ఈ సందర్భంగా వార్డు ప్రజలను కోరారు. విద్యానగర్‌ను ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో పనిచేస్తానని, ప్రతి సమస్యపై పోరాటం చేస్తానని కొన్నె మంజుల గౌడ్ హామీ ఇచ్చారు.

Sthanikam

సూర్యాపేట 33వ వార్డు విద్యానగర్‌ నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిగా కొన్నె మంజుల గౌడ్ బరిలో

Article Image

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డు (విద్యానగర్) జనరల్ రిజర్వేషన్‌గా ఖరారైన నేపథ్యంలో, ఈ వార్డు నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున కొన్నె మంజుల గౌడ్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా కొన్నె మంజుల గౌడ్ మాట్లాడుతూ, గతంలో బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్‌వో) గా సేవలందించిన అనుభవంతో ప్రజల సమస్యలు, ఓటర్ల అవసరాలు తనకు పూర్తిగా తెలుసునని తెలిపారు. బీఎల్‌వోగా పనిచేసిన కాలంలో నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించడంతో పాటు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండడం వల్ల వార్డు ప్రజలకు తాను సుపరిచితురాలినని పేర్కొన్నారు. 33వ వార్డు అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు వంటి సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రజల నమ్మకంతో కౌన్సిలర్‌గా గెలిపించాలని ఆమె ఈ సందర్భంగా వార్డు ప్రజలను కోరారు. విద్యానగర్‌ను ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో పనిచేస్తానని, ప్రతి సమస్యపై పోరాటం చేస్తానని కొన్నె మంజుల గౌడ్ హామీ ఇచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News