Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 12:28 AM

సోమందేపల్లిలో గ్యాస్ కొరతపై ఆందోళన – సకాలంలో సరఫరా చేయాలని సిపిఐ డిమాండ్

సోమందేపల్లిలో గ్యాస్ కొరతపై ఆందోళన – సకాలంలో సరఫరా చేయాలని సిపిఐ డిమాండ్

సోమందేపల్లిలో గ్యాస్ కొరతపై ఆందోళన – సకాలంలో సరఫరా చేయాలని సిపిఐ డిమాండ్
April 18, 2026 06:24 PM 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో గ్యాస్ కొరత కారణంగా వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ బుకింగ్ చేసుకున్న ప్రతి వినియోగదారునికి సకాలంలో సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

సాధారణంగా పెనుకొండలోని శ్రీ రాఘవేంద్ర ఇండానే గ్యాస్ ఏజెన్సీ నుంచి సోమందేపల్లికి రోజుకు 60 సిలిండర్లు సరఫరా అయ్యేవి. అయితే అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడడంతో డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో శనివారం కేవలం 32 సిలిండర్లు మాత్రమే సరఫరా కావడంతో ముందుగా బుకింగ్ చేసుకున్న సుమారు 60 మంది వినియోగదారులు నిరాశకు గురయ్యారు.

ఈ విషయంపై స్థానిక గ్యాస్ సిబ్బందిని సిపిఐ నాయకులు ప్రశ్నించగా, డిమాండ్ అధికంగా ఉండటంతో సరఫరా తగ్గిందని వారు తెలిపారు. అనంతరం ఏజెన్సీ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి మునుపటిలాగే 60 సిలిండర్లు పంపాలని కోరినా స్పందన రాకపోవడంతో వినియోగదారులతో కలిసి సిపిఐ నాయకులు హిందూపురం రహదారిపై నిరసన చేపట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్యాస్ ఏజెన్సీతో మాట్లాడిన అనంతరం అదనంగా 20 సిలిండర్లు సోమందేపల్లికి పంపించారు. వాటిని సిపిఐ నాయకుల సమక్షంలో వినియోగదారులకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బాలస్వామి, జిల్లా కౌన్సిల్ సభ్యులు శీలా నారాయణస్వామి, మండల సహాయ కార్యదర్శి అంజనమ్మతో పాటు పలువురు వినియోగదారులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News