Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:37 AM

సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా

20-04-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సోమందేపల్లి, ఏప్రిల్ 20: సోమందేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మండల సమితి ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో జి. మారుతి కి వినతిపత్రం అందజేశారు.

మండల కేంద్రంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులకు సరైన విధంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం లేదని సిపిఐ నాయకులు ఆరోపించారు. ప్రతిరోజూ సుమారు 60 సిలిండర్లను ఇంటింటికి పంపిణీ చేయాల్సి ఉండగా, కేవలం 30 సిలిండర్లను మాత్రమే ఒకే చోట వినియోగదారులను సమీకరించి పంపిణీ చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

బుక్ చేసుకున్న వినియోగదారులందరికీ గ్యాస్ సక్రమంగా, సమయానికి పంపిణీ చేయాలని, లేనిపక్షంలో సంబంధిత గ్యాస్ ఏజెన్సీని రద్దు చేసి సరైన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వోను కోరారు.

ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా కార్యవర్గ సభ్యులు బాలస్వామి, మండల కార్యదర్శి రాజగోపాల్, సహాయ కార్యదర్శులు అంజనమ్మ, చాంద్ బాషా, జిల్లా కౌన్సిల్ సభ్యులు షీలా, నారాయణస్వామి, మండల సమితి సభ్యులు నరసింహమూర్తి, ఆంజనేయులు, ఈడిగ నాగరాజు, మహిళా సంఘం నాయకులు నూర్జాన్, రామాంజనేయులు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News