Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీటీడీ కల్యాణ మండపం భూమికి హద్దుల నిర్ణయం. న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 01:18 PM

సంగాపూర్ చోరీ కేసులో పోలీసుల సక్సెస్.. 24 గంటల్లోనే నిందితుడి అరెస్ట్

22-07-2026 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగాపూర్ గ్రామంలో జరిగిన చోరీ కేసును రాయికోడ్ పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కాలిమొల్ల నాగేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంటి తాళం పగులగొట్టి సుమారు 20 తులాల వెండి పట్టీలు, శాంసంగ్ మొబైల్ ఫోన్‌ను అపహరించిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక సమాచారం, ఇతర సాక్ష్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సంగాపూర్ గ్రామానికి చెందిన మడిగడ్డ బసవరాజ్ చోరీకి పాల్పడినట్లు గుర్తించి 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు.అనంతరం నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. ఈ సందర్భంగా రాయికోడ్ ఎస్సై చైతన్య కిరణ్ మాట్లాడుతూ, నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

సంగాపూర్ చోరీ కేసులో పోలీసుల సక్సెస్.. 24 గంటల్లోనే నిందితుడి అరెస్ట్

Article Image

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగాపూర్ గ్రామంలో జరిగిన చోరీ కేసును రాయికోడ్ పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కాలిమొల్ల నాగేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంటి తాళం పగులగొట్టి సుమారు 20 తులాల వెండి పట్టీలు, శాంసంగ్ మొబైల్ ఫోన్‌ను అపహరించిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక సమాచారం, ఇతర సాక్ష్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సంగాపూర్ గ్రామానికి చెందిన మడిగడ్డ బసవరాజ్ చోరీకి పాల్పడినట్లు గుర్తించి 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు.అనంతరం నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. ఈ సందర్భంగా రాయికోడ్ ఎస్సై చైతన్య కిరణ్ మాట్లాడుతూ, నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News