Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 12:10 PM

సిరిపురంలో ఆధునిక మురుగు నీటి శుద్ధి కేంద్రం ప్రారంభం. గ్రామాల సమగ్ర అభివృద్ధికి పారిశుధ్యమే పునాది : ప్రభుత్వ విప్ వేముల వీరేశం

21-07-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట:

గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, పరిశుభ్రమైన గ్రామాల నిర్మాణంతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆధునిక మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు.

ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో మురుగు నీటి నిర్వహణను శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టడం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యం మెరుగుపడుతుందన్నారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉంటేనే వ్యాధులను నివారించవచ్చని, పారిశుధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

సీఎస్‌ఐఆర్, డీఎస్‌టీల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శుద్ధి కేంద్రం గ్రామాభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి, తాసిల్దార్ లాల్ బహుదూర్, స్‌ఐఆర్ డైరెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, వెంకట మోహన్, డీఎస్‌టీ డా. రఘునాథ్ రెడ్డి, డీపీవో శ్రీనివాస్ రెడ్డి, ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ డా. ఎ. కిరణ్ కుమార్, డీఎల్‌పీవో ప్రతాప్ నాయక్, ఎంపీడీవో ఎ. రాములు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న జగన్మోహన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

సిరిపురంలో ఆధునిక మురుగు నీటి శుద్ధి కేంద్రం ప్రారంభం. గ్రామాల సమగ్ర అభివృద్ధికి పారిశుధ్యమే పునాది : ప్రభుత్వ విప్ వేముల వీరేశం

Article Image

రామన్నపేట:

గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, పరిశుభ్రమైన గ్రామాల నిర్మాణంతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆధునిక మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు.

ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో మురుగు నీటి నిర్వహణను శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టడం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యం మెరుగుపడుతుందన్నారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉంటేనే వ్యాధులను నివారించవచ్చని, పారిశుధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

సీఎస్‌ఐఆర్, డీఎస్‌టీల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శుద్ధి కేంద్రం గ్రామాభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి, తాసిల్దార్ లాల్ బహుదూర్, స్‌ఐఆర్ డైరెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, వెంకట మోహన్, డీఎస్‌టీ డా. రఘునాథ్ రెడ్డి, డీపీవో శ్రీనివాస్ రెడ్డి, ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ డా. ఎ. కిరణ్ కుమార్, డీఎల్‌పీవో ప్రతాప్ నాయక్, ఎంపీడీవో ఎ. రాములు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న జగన్మోహన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News