Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:02 PM

సి.పి.ఐ(ఎo.ఎల్) పార్టీలో భారీ చేరికలు

సి.పి.ఐ(ఎo.ఎల్) పార్టీలో భారీ చేరికలు

సి.పి.ఐ(ఎo.ఎల్) పార్టీలో భారీ చేరికలు
18-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

తుంగతుర్తి మండల కేంద్రంలోని తూర్పుగూడెం గ్రామంలో ఆదివారం సి.పి.ఐ(ఎం-ఎల్ )మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ జనరల్ బాడీ సమావేశం సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ గ్రామ నాయకులు గుండగాని వెంకన్న అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ తుంగతుర్తి డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ పేర్ల నాగయ్య సమన్వయకర్తగా వ్యవహరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పాసిస్ట్ మతోన్మాద పరిపాలకులు ప్రజా సమస్యలను పట్టించుకోకపోగా, కులం పేరుతో మతం పేరుతో ప్రజల మధ్యన చిచ్చు పెడుతూ కలహాలను సృష్టిస్తున్నారని ఆరోపించారు.సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ, వారి హక్కులను హరించే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. కార్మిక వర్గం కొట్లాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని హక్కును నాలుగు లేబర్ చట్టాలతో హరించివేసి పన్నెండు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టిన అతినీచ ఘన చరిత్ర బిజెపికి దక్కింది అన్నారు. దళారి పెట్టుబడిదారులకు,కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టడంలో బిజెపి ప్రభుత్వం ముందుందని అన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఆహార కొరత తీర్చేందుకు ఏర్పడిన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, చట్టాన్ని సవరిస్తూ,పేరు మారుస్తూ, గ్రామీణ వ్యవసాయ కూలీలను ఉపాధికి దూరం చేస్తున్నారని ఆరోపించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ కార్డు ఇచ్చి, కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 200 పని దినాలు కల్పిస్తూ, రోజుకు కనీస వేతనం 700 రూపాయలు ఇవ్వాలని దేశవ్యాప్తంగా పేదలు ఆందోళన చేస్తుంటే, ఉన్న చట్టాన్ని నిర్వీర్యం చేయటం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. నాలుగు లేబర్ కూడా చట్టాలను రద్దుచేసి, ఉపాధి హామీ చట్టం యధా విధంగా కొనసాగించేంతవరకు ఉద్యమాలను ఉదృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించినారు.ఈ సందర్భంగా తూర్పు గూడెం గ్రామానికి చెందిన 12 కుటుంబాలు మడిపెద్ది లక్ష్మయ్య,గుండగాని రాములు, గుండగాని శ్రీనివాస్, మనోహర్, గుండగాని హుస్సేన్, గుండ్ల వెంకన్న, గుండగాని మహేష్,మద్దెల బిక్షం,మరిపెద్ది నరసయ్య, కన్నెబోయిన ఐలయ్య, తాళ్లపల్లి చంద్రయ్య, గుండగాని యాకయ్య తదితరులు పార్టీలో చేరినారు.ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ కారింగుల వెంకన్న, సీనియర్ పాత్రికేయులు బైరబోయిన వెంకటేశ్వర్లు, నాయకులు గుండగాని వెంకన్న, చామల రమేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సి.పి.ఐ(ఎo.ఎల్) పార్టీలో భారీ చేరికలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News