Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎలేజర్ మృతి తీరని లోటు ;ప్రజా యుద్ధ నౌకఏపూరి సోమన్న, మార్కెట్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, సర్పంచ్ మల్లేష్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 08:40 AM

సిపిఐ శతాబ్ది జాతీయ బహిరంగ సభను విజయవంతం చేయండి: శ్రావణ్ కుమార్ పిలుపు

11-01-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల స్థానికం ప్రతినిధి ప్రశాంత్

సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జనవరి 18న ఖమ్మం పట్టణంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు.నేడు గుండ్రాంపల్లి గ్రామంలో నిర్వహించిన సిపిఐ గుండ్రాంపల్లి గ్రామ శాఖ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో సిపిఐ శతాబ్ద కాలంగా కార్మికులు, రైతులు, విద్యార్థులు, మహిళల హక్కుల కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిందని గుర్తు చేశారు. వెట్టి చాకిరి నిర్మూలనతో పాటు కార్మికులు–కర్షకులను దోపిడీ నుంచి విముక్తి చేయడమే లక్ష్యంగా రాజీలేని పోరాటాలను సిపిఐ కొనసాగించిందన్నారు.శతాబ్ద కాలంలో ఎన్నో త్యాగాలు, అమరవీరుల రక్త తర్పణంతో అనేక విజయాలను సాధించిన సిపిఐ, భారతదేశ రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో నిర్వహించే సిపిఐ శతాబ్ది జాతీయ ఉత్సవాల ముగింపు బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు జిల్లా యాదయ్య, బోడిగే సైదులు, గ్రామ శాఖ కార్యదర్శి జిల్లా సత్యం, సీనియర్ నాయకులు బోడిగే బక్కశెట్టి, రత్నం లింగస్వామి, పానుగుల శివ, సగాల అశోక్, బెదరకోట సైదులు, బొబ్బల శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Sthanikam

సిపిఐ శతాబ్ది జాతీయ బహిరంగ సభను విజయవంతం చేయండి: శ్రావణ్ కుమార్ పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News