Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:50 AM

సింగరేణి వాంబే కాలనీ లో పని అంటేనే భయం… జీహెచ్‌ఎంసీ కార్మికుల ఆవేదన

05-05-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

యాకత్ పుర నియోజకవర్గం పరిధిలోని సింగరేణి కాలనీ

సింగరేణి వాంబే కాలనీ పరిధిలో పని చేస్తున్న జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికుల పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పని చేయాలంటేనే వణుకు పుడుతోంది అంటూ సర్కిల్-7కు చెందిన కార్మికులు మెట్రో ఉదయం మీడియా ముందుకు వచ్చి తమ బాధలను వెల్లగక్కారు. తమకు కనీస భద్రత లేకుండా పోయిందని, అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని వారు ఆరోపించారు.

గతంలో సింగరేణి వాంబే కాలనీ బ్లాక్ నంబర్లు 32, 36 మధ్యలో విధులు నిర్వహిస్తున్న మహేందర్ అనే కార్మికుడిపై భవనం పై నుంచి మద్యం బాటిల్ పడిన ఘటన కలకలం రేపింది. సహచర సిబ్బంది వెంటనే స్పందించి అతన్ని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనతో అక్కడ పని చేసే కార్మికులలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

ప్రతి రోజు చెత్త సేకరణకు వెళ్లే సమయంలో పై నుంచి ఎప్పుడు ఏమి పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మద్యం బాటిళ్లు, చెత్త సంచులు, కొబ్బరి బొండాలు వంటి వస్తువులు నిర్లక్ష్యంగా పడేస్తుండటంతో తమ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తాజాగా మంగళవారం ఉదయం బ్లాక్ నెంబర్ 55వద్ద విధులు నిర్వహిస్తున్న మహేందర్ అనే కార్మికుడిపైన పైనుండి ఆకస్మత్తుగా అన్నం, నీళ్లు, లతో మీద పడడం జరిగింది.ఒకవైపు స్థానికులు చెత్త తీసుకోవడం లేదని ఫిర్యాదులు చేస్తుండగా, మరోవైపు తమ భద్రతపై ఎవరూ దృష్టి పెట్టడం లేదని వారు వాపోతున్నారు.

ఎప్పుడు ఎక్కడ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితిలో పనిచేస్తున్నాం. మా సమస్యలను పట్టించుకునే నాథుడు లేడు అంటూ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి వెంటనే భద్రతా చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని, లేకపోతే విధులను బహిష్కరించక తప్పదని పేర్కొన్నారు.

Sthanikam

సింగరేణి వాంబే కాలనీ లో పని అంటేనే భయం… జీహెచ్‌ఎంసీ కార్మికుల ఆవేదన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News