Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:51 AM

శంకర్‌నగర్ కాలనీలో నూతన ఆర్చి ప్రారంభం కాలనీ అభివృద్ధికి సహకరించిన వారికి ఎమ్మెల్యే అభినందనలు

09-05-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

ఎల్ బీ నగర్ నియోజకవర్గం :హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని శంకర్‌నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన ఆర్చి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ఆర్చిని ప్రారంభించి కాలనీవాసులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి కోసం ముందుకు వచ్చి ఆర్చి నిర్మాణానికి సహకరించిన నక్క శంకర్ గౌడ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. గతంలో కాలనీలో డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణ పనులు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎల్లప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు. కాలనీలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో హయత్‌నగర్ డివిజన్ భారస పార్టీ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్ గౌడ్, సీనియర్ మహిళా నాయకురాలు సింగిరెడ్డి మల్లీశ్వరి రెడ్డి, జక్కిడి రఘువీర్ రెడ్డి, నక్క దర్శన్ గౌడ్, చంద్రారెడ్డి, రాంచంద్రరెడ్డి, కాలనీ గౌరవ అధ్యక్షుడు సుబ్బారెడ్డి, అధ్యక్షుడు రాజ్‌కుమార్, జనరల్ సెక్రటరీ జనార్దన్, నర్సిరెడ్డి, అంజయ్య, రాంరెడ్డి, సునీల్, సత్యనారాయణ, మల్లయ్య, మల్లేశం, రాజారామ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శంకర్‌నగర్ కాలనీలో నూతన ఆర్చి ప్రారంభం కాలనీ అభివృద్ధికి సహకరించిన వారికి ఎమ్మెల్యే అభినందనలు

Article Image

ఎల్ బీ నగర్ నియోజకవర్గం :హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని శంకర్‌నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన ఆర్చి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ఆర్చిని ప్రారంభించి కాలనీవాసులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి కోసం ముందుకు వచ్చి ఆర్చి నిర్మాణానికి సహకరించిన నక్క శంకర్ గౌడ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. గతంలో కాలనీలో డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణ పనులు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎల్లప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు. కాలనీలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో హయత్‌నగర్ డివిజన్ భారస పార్టీ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్ గౌడ్, సీనియర్ మహిళా నాయకురాలు సింగిరెడ్డి మల్లీశ్వరి రెడ్డి, జక్కిడి రఘువీర్ రెడ్డి, నక్క దర్శన్ గౌడ్, చంద్రారెడ్డి, రాంచంద్రరెడ్డి, కాలనీ గౌరవ అధ్యక్షుడు సుబ్బారెడ్డి, అధ్యక్షుడు రాజ్‌కుమార్, జనరల్ సెక్రటరీ జనార్దన్, నర్సిరెడ్డి, అంజయ్య, రాంరెడ్డి, సునీల్, సత్యనారాయణ, మల్లయ్య, మల్లేశం, రాజారామ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News