Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 11:45 AM

శిఖం భూములపై కబ్జాల కలకలం..! నీర్నేముల గ్రామస్తుల ఫిర్యాదుతో కలెక్టర్ స్పందన.

20-07-2026 109 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులకు విచారణ ఆదేశాలు.

రామన్నపేట మండలంలోని నీర్నేముల గ్రామంలోని ప్రభుత్వ, చెరువు గర్భం, కుంటల శిఖం భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలను అరికట్టి, వెంటనే సర్వే నిర్వహించి కబ్జాలను తొలగించాలని కోరుతూ గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గ్రామ బాధ్యతాయుత పౌరులు, గ్రామస్తుల తరఫున వినతిపత్రాన్ని సమర్పించారు.

గ్రామంలో గతంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభ అనంతరం తహసీల్దార్ Endt.No.D/470/2026 ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ఉమ్మడి సర్వే చేపట్టకపోవడం, ఆక్రమణల తొలగింపుపై చర్యలు లేకపోవడంతో అక్రమార్కులు చెరువు శిఖం భూములను ఆక్రమించి సాగు చేస్తున్నారని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై గతంలో దినపత్రికల్లో కథనాలు వచ్చినా అధికారులు స్పందించలేదని పేర్కొన్నారు.

ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తహసీల్దార్, ఇరిగేషన్ ఈఈ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, చెరువు శిఖం భూములు ప్రజల ఉమ్మడి ఆస్తి అని, వాటిని పరిరక్షించడం అధికారుల బాధ్యత అని గ్రామస్తులు పేర్కొన్నారు. భవిష్యత్ తరాల ప్రయోజనాల దృష్ట్యా వెంటనే సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

శిఖం భూములపై కబ్జాల కలకలం..! నీర్నేముల గ్రామస్తుల ఫిర్యాదుతో కలెక్టర్ స్పందన.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News