Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:39 AM

శ్రీవాణి విద్యాలయ వార్షికోత్సవం. ఘనంగా విద్యార్థుల ప్రతిభకు వేదికగా వేడుకలు

02-04-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి-భువనగిరి: భువనగిరి పట్టణంలోని శ్రీవాణి విద్యాలయం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో 2వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీవాణి విద్యా సమితి అధ్యక్షులు పులిమామిడి బాలకృష్ణా రెడ్డి, ఎంపాలా బుచ్చి రెడ్డి, బోగు మాధవరెడ్డి, పులుగం నర్సింహా రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీవాణి విద్యా సంస్థ స్వచ్ఛంద సంస్థగా పనిచేస్తోందని, లాభాపేక్ష లేకుండా సభ్యులు సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ దృష్ట్యా శ్రీవాణి విద్యాలయంలో చేర్పించాలని సూచించారు.

శ్రీవాణి విద్యాలయం ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా ఎదుగుతోందని, ఇక్కడ చదివే విద్యార్థులు ఉన్నత స్థానాలను అధిరోహించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని అభిప్రాయపడ్డారు. పాఠశాల అభివృద్ధికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను జిల్లా స్థాయిలో నిర్వహించాలని నిర్వాహకులు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sthanikam

శ్రీవాణి విద్యాలయ వార్షికోత్సవం. ఘనంగా విద్యార్థుల ప్రతిభకు వేదికగా వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News