Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:36 AM

శాలిగౌరారం మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన

01-04-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పాఠశాలలు, అంగన్వాడీలపై ఆకస్మిక తనిఖీలు

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సుడిగాలి పర్యటన నిర్వహించి పలు ప్రభుత్వ సంస్థలను, పనులను తనిఖీ చేశారు. ప్రభుత్వ పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో అధికారులకు కీలక సూచనలు చేశారు.

వల్లాల గ్రామంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వనమహోత్సవం నర్సరీని పరిశీలించిన కలెక్టర్… మొక్కల పెంపకం, వాటి రకాలు, టార్గెట్, జియోట్యాగింగ్ తదితర వివరాలను తెలుసుకున్నారు. వర్షాకాలానికి ముందుగానే మొక్కలు నాటే స్థలాలను గుర్తించి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. గ్రామానికి కేటాయించిన 13,800 మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

పల్లె ప్రకృతి వనాన్ని తనిఖీ చేసి గ్రామస్తుల ఉదయం నడకకు అనుకూలంగా అభివృద్ధి చేయాలని సూచించారు. అనంతరం ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న ఫిష్‌పాండ్ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. పనులు చేసే చోట నీడ, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని డిఆర్డిఓ శేఖర్‌రెడ్డిని ఆదేశించారు.

ఇందిరమ్మ ఇల్లు, గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి గ్రామసభ ఏర్పాట్లపై సర్పంచ్, అధికారులతో చర్చించారు. గ్రామ సమస్యలను గ్రామసభలో చర్చించి పరిష్కార మార్గాలు కనుగొనాలని సూచించారు.

తెలంగాణ మోడల్ స్కూల్‌ను సందర్శించిన కలెక్టర్ తాగునీటి ప్లాంట్ మరమ్మతులు చేయించాలని, డ్యూయల్ డెస్క్‌లు అమర్చాలని ఆదేశించారు. కట్టెలపై వంట చేయడాన్ని నిలిపివేసి గ్యాస్‌పై వండాలని సూచించారు.

అడ్లూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మంజూరైన భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ సమాఖ్య భవనాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పురోగతిని సమీక్షించారు.

ఈ పర్యటనలో ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, తహసిల్దార్ వరప్రసాద్, పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య, ఎంఈఓ సైదులు, ప్రిన్సిపల్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శాలిగౌరారం మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News