Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 06:27 AM

సేవా కార్యక్రమాలతో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

సేవా కార్యక్రమాలతో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

సేవా కార్యక్రమాలతో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
April 21, 2026 04:36 AM 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం – పూజలు, కేక్ కటింగ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదోని నియోజకవర్గంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆదోని టిడిపి ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా పెద్ద శక్తి గుడి అంబా భవాని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, టూ టౌన్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో సీఎం చంద్రబాబు నాయుడు పేరుపై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆదోని పట్టణంలోని మూడు అన్న క్యాంటీన్ల వద్ద కేక్ కట్ చేసి ప్రజలకు ఉచిత భోజన వసతి కల్పించారు.

ఎన్టీఆర్ విగ్రహం సమీపంలోని అన్న క్యాంటీన్ వద్ద టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, రంగస్వామి నాయుడు, జిందే శంకర్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ భవన్ సమీపంలోని అన్న క్యాంటీన్ వద్ద రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, భూపాల్ చౌదరి, మారుతి నాయుడు, హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, టౌన్ అధ్యక్షుడు తిమ్మప్ప, మండల అధ్యక్షుడు శివప్ప పాల్గొన్నారు.

పోస్ట్ ఆఫీస్ సమీపంలోని అన్న క్యాంటీన్ వద్ద సిద్ధార్థ నాయుడు, శ్రీకాంత్ రెడ్డి, ఉమ్మి సలీం, ప్రణీత్ కుమార్, రాష్ట్ర బెస్టా కార్పొరేషన్ డైరెక్టర్ రామంజి తదితరులు పాల్గొని ప్రజలతో కలిసి కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, సీఎం జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో ఉచిత భోజన వసతి కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే భువనేశ్వర్ అన్న క్యాంటీన్‌కు రూ.76 లక్షల విరాళం అందజేయడం విశేషమన్నారు.

ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News