Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ హామీలు అమలు చేయాలి.. ప్రజావాణిలో బీఆర్‌ఎస్‌ నాయకుల వినతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 12:40 PM

సీతారాంపురం వద్ద తృటిలో తప్పిన పెను ప్రమాదం

22-07-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పల్లె వెలుగు బస్సును వెనుక నుంచి ఢీకొన్న సిమెంట్ లారీ.. పలువురికి స్వల్ప గాయాలు.

కోదాడ, జూలై 22:

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారాంపురం స్టేజి సమీపంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. మిర్యాలగూడ నుంచి కోదాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సును వెనుక నుంచి ఓ సిమెంట్ లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, వేగంగా వస్తున్న సిమెంట్ లారీ అదుపుతప్పి బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు, లారీ రెండూ రోడ్డుపక్కకు దూసుకెళ్లాయి. దీంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలు కాగా, స్థానికులు వెంటనే స్పందించి బాధితులకు సహాయం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

ప్రమాదం తీవ్రంగా ఉన్నప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

సీతారాంపురం వద్ద తృటిలో తప్పిన పెను ప్రమాదం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News