Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:57 AM

సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి సవిత

20-04-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో సీఎం N.నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించగా, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆయన నాయకత్వాన్ని కొనియాడారు. రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబుతోనే సురక్షితమని, ఆయన విజనరీ పాలనతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రగామిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అవినీతి మచ్చలేని నాయకుడిగా చంద్రబాబు నిలిచారని, ఆయన బ్రాండ్ ఇమేజ్ వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.

రాయలసీమ అభివృద్ధిలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, హార్టికల్చర్ మరియు డ్రోన్ రంగాల అభివృద్ధితో ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని మంత్రి సవిత వివరించారు. పెనుకొండలో కియా పరిశ్రమ స్థాపనతో వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించారని గుర్తుచేశారు.

వైసీపీ బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేసిన మంత్రి, తమ ప్రభుత్వం ఎప్పుడూ అవినీతి, అక్రమాలకు పాల్పడలేదన్నారు. జగన్ పాలనను ప్రజలు తిరస్కరించారని, ఆయన రాజకీయ అధ్యాయం ముగిసిందని వ్యాఖ్యానించారు. ప్రజలు మళ్లీ మళ్లీ చంద్రబాబునే ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా పెనుకొండలో 76 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించగా, అనంతరం కియా పరిశ్రమ వద్ద 76 కేజీల కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి సవిత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News