మునగాల స్థానిక ప్రతినిధి పాముల రాఘవేందర్
మునగాల మండలం రేపాల గ్రామంలో రాజ్యలక్ష్మి సమేత స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా దేవాలయ పత్రికను ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి దేవాలయ చైర్మన్ సారిక చిన్నరామయ్య యాదవ్ అధ్యక్షత వహించారు. జాతర విశిష్టత, భక్తుల సహకారం, సంప్రదాయాల పరిరక్షణలో పత్రిక ప్రాధాన్యతను వక్తలు వివరించారు.ఈ సందర్భంగా ఎలక నరేందర్ రెడ్డి, దేవాలయ చైర్మన్ సారిక రామయ్య, రావు బుచ్చి రెడ్డి, బెజవాడ సీతారాములు, గండు వీరబాబు, చిట్యాల నర్సిరెడ్డి, రావులపెంట సతీష్, పల్లి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.జాతర నిర్వహణలో భాగంగా చేపట్టిన ఏర్పాట్లకు గ్రామ ప్రజలు, భక్తులు విశేష సహకారం అందిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి