Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:26 AM

స్వచ్ఛంద సేవలతో దాహార్తికి చల్లని నివాళి

20-04-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,

స్వచ్ఛంద సంస్థల సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్ సీహెచ్ మురళీకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం భువనగిరి కొత్త బస్టాండ్ ఆవరణలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘చలివేంద్రం’ను ఆయన స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ శ్రీలతతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు గత కొన్ని ఏళ్లుగా వేసవి కాలంలో బస్టాండ్ వద్ద చలివేంద్రాన్ని నిర్వహిస్తూ ప్రయాణికుల దాహార్తిని తీర్చడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు సోమ కృష్ణమూర్తి, కస్తూరి లక్ష్మీనారాయణ, సోమ సరస్వతి, వంగపల్లి అంజయ్య స్వామి, కుక్కడపు చంద్రశేఖర్, చింతపండు రాజు, పసుపునూరి వాణి, బుస్సా కృష్ణవేణి, గట్ఠు రమాదేవి పాల్గొన్నారు. అలాగే సామాజిక కార్యకర్తలు కొడారి వెంకటేష్, మాటూరి బాలేశ్వర్, జంపాల అంజయ్య, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, సిబ్బంది వెంకటయ్య, శ్రీధర్, గణేష్ తదితరులు హాజరయ్యారు.

Sthanikam

స్వచ్ఛంద సేవలతో దాహార్తికి చల్లని నివాళి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News