Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

స్వచ్ఛ చౌటుప్పల్ లక్ష్యంగా 99 రోజుల ప్రణాళిక పురపాలక సంఘంలో ఘనంగా ప్రారంభం…

06-03-2026 229 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పట్టణ అభివృద్ధి, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక (ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక) ను చౌటుప్పల్ పురపాలక సంఘంలో శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మొగుదాల పావని ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. పట్టణాల సమగ్ర అభివృద్ధిలో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని ఆమె తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి కౌన్సిలర్లు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులతో పట్టణ పరిశుభ్రత, అభివృద్ధిపై ప్రతిజ్ఞ చేయించారు.చైర్‌పర్సన్ మొగుదాల పావని మాట్లాడుతూ అందరి సహకారంతో చౌటుప్పల్ పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ‘స్వచ్ఛ చౌటుప్పల్’ లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని అన్నారు.ప్రతిజ్ఞ కార్యక్రమం అనంతరం తంగడపల్లి 5వ వార్డు బ్రహ్మంగారి గుడి సమీపంలోని రహదారులను శుభ్రం చేసి చెత్త కుప్పలను తొలగించారు. పట్టణ ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని, వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ జి.వెంకట రామిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, పారిశుధ్య విభాగం అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

స్వచ్ఛ చౌటుప్పల్ లక్ష్యంగా 99 రోజుల ప్రణాళిక పురపాలక సంఘంలో ఘనంగా ప్రారంభం…

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News