Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:35 AM

సత్యసాయి చేనేతకు ప్రపంచ ఖ్యాతి

సత్యసాయి చేనేతకు ప్రపంచ ఖ్యాతి

సత్యసాయి చేనేతకు ప్రపంచ ఖ్యాతి
18-04-2026 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

ధర్మవరం,: ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి జిల్లాకు చేనేత రంగంలో విశేష గుర్తింపు లభించిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. చైనా దేశంలోని బీజింగ్, గ్యాంగ్జూ నగరాల్లో నిర్వహించిన వసంతమేళా-2026లో ధర్మవరం చేనేత ప్రతిభను చాటిన జాతీయ అవార్డు గ్రహీత డిజైనర్ జూజారే నాగరాజును కలెక్టర్ ఘనంగా సత్కరించారు.

ధర్మవరం నుంచి చేనేత మగ్గాన్ని తీసుకెళ్లి, అక్కడ ప్రత్యక్షంగా ఏర్పాటు చేసి చైనా ప్రజలకు భారతీయ సంప్రదాయాన్ని పరిచయం చేయడం ద్వారా నాగరాజు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కలెక్టర్ ప్రశంసించారు. మరుగున పడుతున్న చేనేత పరిశ్రమను నాగరాజు వంటి కళాకారులు ముందుకు తీసుకెళ్తున్నారని, వారి కృషితో ధర్మవరం మరియు సత్యసాయి జిల్లా పేరు మరింత ఎత్తుకు చేరాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా నాగరాజు కంప్యూటర్ డిజైనింగ్ విధానం, డిజైన్ గ్రాఫ్‌లు, ప్రింటింగ్ ప్రక్రియల గురించి కలెక్టర్‌కు వివరించారు. అలాగే ధర్మవరం పట్టు చీరలు, పట్టు శాలువాల ప్రత్యేకతలను సమగ్రంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చేనేత అధ్యక్షుడు పరిసే సుధాకర్, కమతం కాటమయ్య, చేనేత అధికారులు సుబ్బానాయుడు, శీనా నాయక్, ధర్మవరం తహసీల్దారు, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ శాఖ అధికారులు, చేనేత కార్మికుడు చిప్పల మార్కండేయ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సత్యసాయి చేనేతకు ప్రపంచ ఖ్యాతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News